ప్రియుడితో కన్న కూతురిని హత్య చేయించిన తండ్రి

హన్మకొండ జిల్లాలో కారులో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్కతుర్తి శివారులో కారు డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారించారు. మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించారు. మానసకు గతంలో రెండు వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నట్లు, ప్రస్తుతం ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతవారం అరుణాచలం వెళ్తున్నానని చెప్పి వినోద్ వద్దకు వచ్చిన మానస.. తనను పెళ్లి చేసుకోవాలని...