నల్లగొండలో గంజాయి విక్రయాలు, బైక్ చోరీల ముఠా అరెస్ట్

ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు నల్లగొండ: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా నల్లగొండకు తరలించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల నుంచి మొత్తం 2.5...