నల్గొండకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్.. రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న బాలేనో కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ పోలీసులను గమనించి తప్పించుకునేందుకు యత్నించడంతో వెంటనే వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డ్రైవర్ సీటు కింద గంజాయి ప్యాకెట్‌తో పాటు కారులో మొత్తం 2.240 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. కారులో ప్రయాణిస్తున్న గండికోట వంశీ, చిత్రం రాకేష్, చింతల...