ప్రైవేట్ స్కూల్ టీచర్ కరస్పాండెంట్ దారుణ హత్య

నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జేబీ కాలనీలో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రూపారెడ్డి (45) దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న భర్త ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో కిరాయిదారుల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.