ప్రియుడితో కలిసి భర్త, ఐదేళ్ల కొడుకును హత్య చేసిన మహిళ

వివాహేతర సంబంధం కారణంగా బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభినందన్, హరిణి దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటంతో హరిణి వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు హరిణిని ప్రశ్నించాడు. దీంతో వినయ్‌ను ఇంటికి పిలిపించిన హరిణి.. ఇద్దరూ కలిసి అభినందన్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలికిడి విని నిద్రలేచిన ఐదేళ్ల కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...