ఖరీదైన కారు ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు
హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి మృతి చెందింది. లభించిన సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్న కారు రోడ్డు దాటుతున్న భారతిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. లైఫ్‌స్టైల్‌లో పనిచేస్తున్న భారతి.. లంచ్ కోసం ఐటీసీ కోహినూర్ సమీపంలోని ఫుడ్ స్టాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతిని అదే కారులో అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు...