బండరాయితో భార్యపై దాడి.. భర్తపై కేసు

తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో చోటుచేసుకుంది. జయనగర్‌లో నివాసం ఉంటున్న షేక్ మస్తాన్‌కు భార్య మల్లికపై కొంతకాలంగా అనుమానం ఉండటంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అర్థరాత్రి దాటిన తర్వాత మల్లికపై బండరాయితో దాడి చేసినట్లు సమాచారం. మల్లిక అరుపులు విన్న కుమార్తె యాస్మిన్, స్థానికుల సహాయంతో ఆమెను రక్షించి 108...