ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి: సీఐటీయూ

నల్గొండ పట్టణంలో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో నిరసన ర్యాలీలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.   ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ప్రకాశం బజార్, ఎగ్బాల్ మినార్, పాతబస్తీ చౌరస్తా తదితర ప్రాంతాల్లోని మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ల వద్ద ప్రచారం నిర్వహించారు. జైల్ భరో కార్యక్రమం ఉద్దేశాలను కార్మికులకు వివరించి, ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, యూనియన్ పట్టణ...