నల్లగొండ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురు నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డి ఇంట్లో ఒంటిపై కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది. హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు గ్లౌజులు ధరించినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు లభించకపోవడంతో కేసు...