చిలకలూరిపేట B.Tech విద్యార్థిని మృతదేహం లభ్యం.. కలకలం
చిలకలూరిపేటకు చెందిన ఓ B.Tech విద్యార్థిని మృతదేహం కారంపూడి మండలం చింతపల్లి గ్రామ శివారులోని పొలాల్లో లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా (23) మిట్టపల్లి ప్రాంతంలోని ఓ కళాశాలలో B.Tech చదువుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన యువతి ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా యువతి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు...