ఎయిర్ ఇండియా విమానంలో కలకలం.. పైలట్‌కు డ్రగ్స్ పాజిటివ్!

ఎయిర్ ఇండియా విమానం 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందికి పడిపోయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానాన్ని నడిపిన పైలట్‌కు నిర్వహించిన డ్రగ్ టెస్టులో సైకోయాక్టివ్ పదార్థాలు (గంజాయి) ఉన్నట్లు తేలినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లకు స్క్రీనింగ్ నిర్వహించగా.. కో-పైలట్‌కు ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు గుర్తించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా స్పందించి ఎయిర్ ఇండియా CEOకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.