కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, చార్జ్‌షీట్ సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఐ లంచం డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల పక్కా ప్రణాళికలో భాగంగా గురువారం ఎస్ఐ తన నివాసంలో బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు....