అనుమానంతో దంపతుల మధ్య విభేదాలు.. మహిళ మృతి
మేడ్చల్: బాలానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమిత్రానగర్‌కు చెందిన దొమ్మట నవనీత (28) శనివారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. నవనీత తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద ఉంచి అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. భర్తకు చెడు అలవాట్లు ఉన్నాయని, మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.