తిప్పర్తిలో కరెంటు కష్టాలు.. వెంటనే పరిష్కరించాలి: మండల ప్రజల డిమాండ్
తిప్పర్తి: మండలంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయని, సమస్యలపై జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని తిప్పర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ సిబ్బంది స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో రాత్రివేళ అత్యవసర సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. గాలులు, దుమారాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రిప్పింగ్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు...