వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీతో పాటు పలువురు మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుత వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు....