నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
నల్గొండ: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.