నల్లగొండలో మహిళలకు ఉచిత బ్యూటిషన్‌ కోర్సు

నల్లగొండ, ఆగస్టు 22 (విజయకెరటం ప్రతినిధి): దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం), నల్లగొండలో మహిళలకు 30 రోజుల ఉచిత బ్యూటిషన్‌ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్‌ ఆర్. మమత తెలిపారు. ఈ శిక్షణకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు మహిళలు, 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ మహిళలతో పాటు పాఠశాల విద్యను మధ్యలో నిలిపివేసిన మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులు 2026...