ప్రియుడి మోజులో దారుణ కుట్ర.. భర్త, అత్తకు విషం కలిపిన కూర వడ్డించిన భార్య అరెస్ట్
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారనే అనుమానంతో ఓ మహిళ వారిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. మదక్‌పల్లి గ్రామానికి చెందిన సోని అనే మహిళ తన భర్త భూమయ్య, అత్త భూదేవ్వను తొలగించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు (పురుగుమందు) కలిపి వారికి భోజనంగా వడ్డించింది. భోజనం చేసిన కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం...