హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి గుట్టురట్టు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన విస్తృత సోదాల్లో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. మొత్తం 130 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా, 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు 36 టన్నుల కల్తీ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లతో నకిలీ నెయ్యిని తయారు చేసి "ప్యూర్ దేశీ నెయ్యి" పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిని పూజా కేంద్రాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో...