పింఛన్‌దారుడు మృతి చెందితే భాగస్వామికి వెంటనే పెన్షన్
తెలంగాణ: పింఛన్‌దారుడు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా భార్య లేదా భర్తకు పెన్షన్ అందించనున్నారు. ఈ ప్రక్రియలో వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేందుకు డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక లాగిన్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.