ఎన్నికల హామీ అమలు.. గ్రామస్తుల ఇంటి పన్ను చెల్లించిన సర్పంచ్
మెదక్ జిల్లా: ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీని దేవరపల్లి సర్పంచ్ అశోక్ నిలబెట్టుకున్నారు. గ్రామంలోని ప్రజలకు సంబంధించిన రూ.2 లక్షల ఇంటి పన్నును సర్పంచ్ స్వయంగా చెల్లించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఇంటి పన్ను చెల్లించినట్లు సర్పంచ్ అశోక్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తమ తరఫున ఇంటి పన్ను చెల్లించడం పట్ల గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయడంతో గ్రామంలో సర్పంచ్ చర్యపై...