మహిళ అనుమానాస్పద మృతిపై కలకలం.. పూర్తి వివరాల కోసం పోలీసుల దర్యాప్తు
నల్లగొండ జిల్లా: కనగల్ మండలం ఇస్పూర్ గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తుండగా.. ఆమెను చంపి ఉరేసినట్లుగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలిని భర్త, అత్తమామలు నిత్యం వేధించేవారని బంధువులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించేలా ఆనవాళ్లు సృష్టించారని, మెడపై అనుమానాస్పద గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు...