కవితమ్మ సంకల్పం.. ముస్లిం మహిళలకు కొత్త దిశ
ముస్లిం మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గ పరిణామమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. ముస్లిం మహిళలు కేవలం ఓటర్లుగా కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులుగా, విధానాలను రూపొందించే ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ముస్లిం సమాజం గణనీయమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ నిర్ణయాత్మక వేదికల్లో ముస్లిం మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని సయ్యద్...