నల్లగొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకే కేటాయించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. డ్రా అనంతరం మిగిలిన ఇళ్లకు గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రజావాణి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాదర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన నిరుపేదలను...