పుట్టినరోజు వేడుకలు పక్కనపెట్టి.. మృతుడి కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే

నల్లగొండ: ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అండగా నిలిచారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి.. బాధిత కుటుంబానికి ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నిలబెట్టుకున్నారు. కట్టా అన్నారంలో రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన భూపాల్ రెడ్డి.. పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “నేనున్నాను.. అధైర్యపడొద్దు” అంటూ వారికి భరోసా కల్పించారు. మృతుడికి మూడున్నరేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తె...