ఆగస్టు 10న ‘జైల్ భరో’ విజయవంతం చేయండి: సీఐటీయూ పిలుపు
నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (BCWU-CITU) పట్టణ అధ్యక్షుడు సల్వోజు సైదాచారి అధ్యక్షతన కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 10న నల్లగొండ పట్టణంలో చేపట్టనున్న నిరసన ర్యాలీ, జైల్...