నల్లగొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
నల్లగొండ, ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలూస్ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ (అమేర్), వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్డు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా...