వనం భాస్కర్‌కు అండగా నిలిచిన మొహమ్మద్ అయూబ్
వరంగల్: వరంగల్ తూర్పు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎల్‌ఓసీ ద్వారా ఉచిత వైద్యం అందేలా వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అయూబ్ తన ఎదుగుదలకు సహకరించిన వరంగల్ తూర్పు ప్రాంత జర్నలిస్టులంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానమని, వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్‌కు ఎల్‌ఓసీ నిధుల ద్వారా ఉచిత చికిత్స...