చైనా నుంచి భారత్ వరకు 3,500 కి.మీ మేర విస్తరించిన రుతుపవన మేఘాలు.. INSAT-3DS ఉపగ్రహం చిత్రాల్లో స్పష్టత

భారత అంతరిక్ష సంస్థకు చెందిన INSAT-3DS వాతావరణ ఉపగ్రహం తీసిన తాజా చిత్రాలు రుతుపవనాల విస్తృతిని ఆవిష్కరించాయి. పశ్చిమ చైనా, టిబెట్ పీఠభూమి నుంచి హిమాలయాల మీదుగా ఉత్తర, మధ్య భారతదేశం వరకు సుమారు 3,500 కిలోమీటర్ల మేర రుతుపవన మేఘాలు విస్తరించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఉపగ్రహ చిత్రాల్లో ఆసియా ఖండంపై తెల్లని దట్టమైన మేఘాలు నిరంతరాయంగా ఒక భారీ పట్టీలా కనిపిస్తున్నాయి. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇవి చురుకైన నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఎగువస్థాయి మేఘాల వ్యవస్థకు సంకేతం....