నల్గొండ గౌడ సంఘానికి నూతన నాయకత్వం.. ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నిక

నల్గొండ, ఆగస్టు 25: తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం నల్గొొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న జీఎల్ గార్డెన్‌లో జిల్లా గౌడ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నకరికంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గౌడ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్‌తో పాటు పలువురు రాష్ట్ర...