ఇకపై 100 కాదు.. 112కు డయల్ చేస్తే 18 రకాల సేవలు

తెలంగాణలో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉన్న డయల్-112 సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. డయల్-112 ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు రూ.18 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో డయల్-112 కాల్ సెంటర్‌ను ఆధునీకరించడం, సాంకేతిక వసతులను మెరుగుపరచడం, పోలీసు, ఫైర్, మెడికల్ రెస్పాన్స్ బృందాల సమన్వయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఒకే...