క్రైమ్‌ పారామీటర్ల అమలులో నల్లగొండ పోలీసుల సత్తా

నల్లగొండ, ఆగస్టు 29 (ఉమ్మడి జిల్లా ప్రతినిధి, విజయ కెరటం): క్రైమ్‌ పారామీటర్ల అమలు, పోలీస్‌ శాఖ పనితీరులో నల్లగొండ జిల్లా పోలీస్‌ శాఖ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ యూనిట్ల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరు ఆధారంగా నల్లగొండ జిల్లా క్లస్టర్‌-3లో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌కు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ శనివారం ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది...