వెంబడించి హత్య.. పల్నాడులో వైసీపీ నేత చెన్నారెడ్డి మృతి”

  పల్నాడు జిల్లా, రెంటచింతల: పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రోజూలాగే పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లిన చెన్నారెడ్డి, తిరిగి ఇంటికి వస్తుండగా రెంటచింతల–రెంటాల రహదారిపై గుర్తుతెలియని దుండగులు ఆయనపై ప్రాణాంతక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై...