మస్జిద్-ఏ-ఫలాహ్ వక్ఫ్ బోర్డులో నమోదు
అయూబ్ చొరవకు మత పెద్దల ప్రశంసలు.. ఘన సన్మానం వరంగల్, విజయ కెరటం ఆగస్టు 28: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లేబర్ కాలనీలో ఉన్న మస్జిద్-ఏ-ఫలాహ్ వక్ఫ్ బోర్డులో నమోదు కావడంలో ప్రత్యేక చొరవ చూపిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్‌ను మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మస్జిద్ వక్ఫ్ బోర్డులో నమోదు కావడానికి అవసరమైన ప్రక్రియలో మహమ్మద్ అయూబ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనవంతు సహకారం అందించారని మత పెద్దలు, ముస్లిం సోదరులు...