జాగిత్యాలలో ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

జగిత్యాల, ఆగస్టు 13: లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మంచికట్ల రాహుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బీర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేసేందుకు అధికారిక అనుకూలత చూపాలని రాహుల్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో లంచాన్ని రూ.40 వేలకు తగ్గించగా, అందులో భాగంగా రూ.30 వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. [video width="478" height="850"...