ఎస్సీ, ఎస్టీ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి: కమిషన్ చైర్మన్
నల్గొండ, ఆగస్టు 12: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా పూర్తిగా వారి అభివృద్ధికే వినియోగించాలని, రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులను వేగంగా పరిష్కరించి...