ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌పై మామిడాలలో పాఠశాల బహిష్కరణ
తిప్పర్తి: మామిడాల ఎంపీపీఎస్ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై గంగన్నపాలెం, జొన్నగడ్డలగూడెం పాఠశాలలకు పంపించడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పాఠశాల బహిష్కరణ చేపట్టారు. మామిడాల పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, ఇప్పటికే ఒక ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై పంపించారని, తాజాగా మరో ఉపాధ్యాయుడిని పంపించడంతో బోధనపై ప్రభావం పడుతోందని తెలిపారు. గంగన్నపాలెంలో 13 మంది, జొన్నగడ్డలగూడెంలో 15 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ రెండు పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. మామిడాల పాఠశాలలో ఈ ఏడాది సర్పంచ్ చొరవతో 20 మంది విద్యార్థులను...