మాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల అక్రమ భవనం
హైదరాబాద్: మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. అంజయ్యనగర్‌లో నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనం కూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా దెబ్బతింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 గజాల స్థలంలో, అదీ నాలా పక్కనే ఏడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం...