దేవరకొండలో వీధికుక్కల బెడద.. చిన్నారిపై దాడి
దేవరకొండ: పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల బెడద పెరిగింది. 11వ వార్డులో ఇటీవల ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని కుక్కలు తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో కాలనీవాసుల్లో భయాందోళన నెలకొంది. ప్రధానంగా పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో వీధికుక్కల సంచారం పెరగడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వీధికుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కల నియంత్రణతో పాటు, ప్రమాదకరంగా సంచరిస్తున్న కుక్కలను గుర్తించి...