హుప్పుగూడ రైల్వే స్టేషన్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!

హైదరాబాద్‌లోని హుప్పుగూడ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 2న జరిగిన దారుణ హత్య కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నేపాల్‌కు చెందిన **రాజ్ కుమార్ శర్మ అలియాస్ యువరాజ్ శర్మ (47)**ను కాచిగూడ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఆగస్టు 6న సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ శర్మ నేపాల్‌లోని ఖాట్మండుకు చెందిన వ్యక్తి. సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఫంక్షన్ హాళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కూలీగా...