గురువును హతమార్చిన శిష్యులు.. వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ

విజయకేరటం – నల్గొండ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మైనర్లు కావడంతో వారి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఆగస్టు 11న రాత్రి జేబీ కాలనీలోని తన నివాసంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించి, కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు 80 మందిని విచారించడంతో...