అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం.. 27 నిమిషాల ప్రయాణానికి రూ.420!

స్వీడన్‌కు చెందిన ‘హార్ట్ ఏరోస్పేస్’ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘X1’తో ప్రయోగాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసింది. న్యూయార్క్‌లోని ప్లాట్స్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి 27 నిమిషాల పాటు విమానం ప్రయాణించింది. ఈ ప్రయోగానికి సుమారు $5 (రూ.420) విద్యుత్ ఖర్చు అయినట్లు సంస్థ వెల్లడించింది. 30 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానంలో ప్రస్తుతం పైలట్ మాత్రమే ప్రయాణించారు. భవిష్యత్‌లో ప్రయాణికులను కూడా తీసుకెళ్లేలా ఈ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.