రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించకపోవడంతో తుకారం (35) తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని అనుమానించాడు. తాను తీసుకోలేదని తండ్రి చెప్పినా వినకుండా అతనితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కత్తితో దాడి చేయడంతో తండ్రి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.