చందనవల్లి డంపింగ్ యార్డులో పులి పిల్లల కలకలం
చందనవల్లి డంపింగ్ యార్డులో రెండు పులి పిల్లలు సంచరిస్తున్నట్లు సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం ఉదయం చెత్తను సేకరించేందుకు వెళ్లిన కార్మికులకు పులి పిల్లలు కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు, అటవీశాఖ సిబ్బందికి తెలియజేసినట్లు సమాచారం. కాగా, పులి పిల్లలు డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ నుంచి దూకి బయటకు పరుగెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ ఉన్నవారిలో మరింత ఆందోళన నెలకొంది. అయితే, పులి పిల్లల సంచారంపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అటవీశాఖ అధికారులు...