సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తన కస్టడీ సమయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. సీపీ సజ్జనార్‌తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులపై ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీలో తనపై అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని, టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి వేధింపులకు గురిచేశారని ఆరోపించినట్లు సమాచారం. అలాగే తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు సీపీ సజ్జనార్‌పై ఉదయ్...