చిట్యాలలో వాహనం బోల్తా.. 4 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్ రాడ్ సమస్య కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు." ప్రమాదంతో రోడ్డుపై వాహన రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. వాహనాన్ని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.