రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో పద్మ అరెస్ట్
జగిత్యాల జిల్లా: మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు సీడీపీవో పద్మ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000గా, మొత్తం రూ.63,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఫిర్యాదుదారుడి నుంచి కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు....