పెండింగ్ కేసులకు చెక్
నల్లగొండ, సెప్టెంబర్ 11, విజయ కెరటం: జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నల్లగొండలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పెండింగ్, NBW, సైబర్, ఆస్తి నేరాలు, NDPS కేసులపై సమీక్ష నిర్వహించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, గంజాయి, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్, రాత్రి గస్తీ పెంచాలని ఆదేశించారు....