ఇరుగు వర్గాల మధ్య ఘర్షణ – ముగ్గురికి గాయాలు, కేసు నమోదు

విజయ కెరటం / తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి కత్తిపోట్లతో గాయాలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, గంగన్నపాలెం గ్రామానికి చెందిన మర్రి నరేష్‌పై గతంలో 2025 వినాయక చవితి సందర్భంగా గంటెకంపు మధు, మేకల శివాజీ తదితరులు దాడి చేసిన కేసు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో...