బ్యాంకింగ్ రంగంలో సమ్మెల మేఘాలు డిమాండ్లపై యూనియన్ల గట్టిపట్టు

సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె – 28 నుంచి 30 వరకు మూడు రోజుల ఆందోళన న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) సమ్మెలకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ఉపసంహరించుకోవడం వంటి కీలక డిమాండ్లపై బ్యాంక్ యూనియన్లు గట్టిగా నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యుఎఫ్‌బియు ప్రకటించింది. ఆ తరువాత సెప్టెంబర్...